ముథోల్​ నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే రామారావు పటేల్ ​

భైంసా, వెలుగు: ముథోల్​ నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ ​తెలిపారు. లోకేశ్వరం మండలం మన్మథ్​ గ్రామంలో రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలుమంజూరు చేస్తూ బుధవారం భైంసాలోని తన క్యాంపు ఆఫీస్​లో ఆ గ్రామస్తులకు ప్రొసిడింగ్స్​ అందజే శారు.

 పురాతన ఆలయాల పునర్నిర్మాణాలకు సైతం దశల వారీగా  చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ ​పృథ్వీరాజ్, వీడీసీ అధ్యక్షుడు ఆలూరి శేఖర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.