క్రిటికల్ ​కేర్ ​సెంటర్, నర్సింగ్​ కాలేజీలకు శంకుస్థాపన

  • ముల్కల్ల గోదావరిలో ఇసుక రీచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మెడికల్ కాలేజీ ఆవరణలో రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్, సాయికుంటలో రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ నెల 21న మంత్రులు దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై పనులను ప్రారంభిస్తారని తెలిపారు. రెండున్నరేండ్లలో నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. క్రిటికల్ కేర్ సెంటర్​ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. 50 బెడ్స్​ కెపాసిటీతో ఎమర్జెన్సీ కేసులకు ఇక్కడ ట్రీట్​మెంట్​చేస్తారని చెప్పారు. అలాగే ముల్కల్ల గోదావరిలో ఇసుక రీచ్ ను ప్రారంభించారు. 

నాణ్యమైన భోజనం అందించాలి

సాయికుంటలోని గిరిజన బాలిక ఆశ్రమ స్కూల్​ను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. రూ.50వేల విలువైన వస్తువులు, ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు అందజేశారు. అనంతరం గోదావరి తీరంలో జరుగుతున్న వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు.