రోడ్డు నిర్మాణానికి సహకరించాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపల్లి సమీపంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన  రహదారి నిర్మాణానికి కాలనీవాసులు సహకరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు.  శుక్రవారం రహదారి నిర్మాణం వల్ల ఇళ్లను కోల్పోతున్న వారితో కలిసి ఇళ్లను పరిశీలించారు.

 రోడ్డు నిర్మాణం వల్ల పట్టణ అభివృద్ధి తో పాటు ప్రయాణికులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇళ్ల యజమానులు ముందుకు వస్తే   నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.