బేషరతుగా రూ.2లక్షల రుణమాఫీ చేయాలి : పాయల్ ​శంకర్

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని రైతులందరికీ బేషరతుగా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్ ​శంకర్ ​ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై సోమవారం మంచిర్యాలలోని పార్టీ జిల్లా ఆఫీసులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యాల ఏమాజీ, మున్నారాజ్​సిసోడియా, ఎనగందుల కృష్ణమూర్తి, రజనీష్ జైన్, దుర్గం అశోక్​, అమురాజుల శ్రీదేవి, మల్లేశ్​ తదితరులు​ పాల్గొన్నారు. 

ఎన్​హెచ్​63 బాధిత రైతుల వినతి

ఎన్​హెచ్​63 గ్రీన్​ ఫీల్డ్​ను రద్దు చేసి బ్రౌన్ ​ఫీల్డ్​హైవే నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బాధిత రైతులు పాయల్ ​శంకర్​ను కోరారు. గ్రీన్ ​ఫీల్డ్​వల్ల దాదాపు 500 మంది రైతులు భూములు కోల్పోతున్నామని తెలిపారు. కొంతమంది కుట్రలతో బ్రౌన్​ ఫీల్డ్​ను అడ్డుకొని మళ్లీ గ్రీన్ ​ఫీల్డ్​ను తీసుకొచ్చారని వివరించారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపుకు గురై సర్వం కోల్పోయిన రైతులను మరోసారి రోడ్డుపాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.