తర్నం వాగుపై ఐరన్ బ్రిడ్జి నిర్మించాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు : జైనథ్ మండలంలోని తర్నం వాగుపై ఐరన్ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులను కోరారు. మంగళవారం హైదరాబాద్ లో నేషనల్ హైవే అధికారులను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. తర్నం బ్రిడ్జి కుంగిపోవడంతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసినప్పటికీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిందన్నారు. మండల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాగుపై ఐరన్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.

రెండు మండలాలతోపాటు మహారాష్ట్రకు ఈ రహదారి అనుసంధానంగా ఉందన్నారు. దీనిపై  సానుకూలంగా స్పందించిన నేషనల్ హైవే ఆర్వో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.