బీజేపీ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి : పైడి రాకేశ్ రెడ్డి

నర్సాపూర్ (జి)/ఇచ్చోడ, వెలుగు: సెప్టెంబర్ 1 నుంచి తలపెట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలో విజయవంతం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపూర్​(జి) మండలం సిర్గాపూర్​లోని ఓ ఫంక్షన్ ​హాల్​లో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో రాకేశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపుతో చేయాలని, ప్రతి గ్రామంలో బూత్ స్థాయి కార్యకర్తలు కష్టపడి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నేతలు రావుల రామనాథ్, అయ్యన్న గారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చోడలో..

ఇచ్చోడలో బీజేపీ మండలాధ్యక్షుడు కేంద్ర నారాయణ ఆధ్వర్యంలో సభ్యత్వ వర్క్ షాప్ నిర్వహించారు. చీఫ్ గెస్ట్​గా వచ్చిన జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మండల  వ్యాప్తంగా బీజేపీ పార్టీ మరింత బలపడేలా సభ్యత్వ నమోదు  చేపట్టాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మడి భీంరెడ్డి, మాధవరావు, అసెంబ్లీ కన్వీనర్ బాబా రావు పటేల్, కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.