నీట్ పేపర్ ​లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : రోహిత్ రావు

  • నర్సాపూర్​లో మోదీ దిష్టిబొమ్మ దహనం
  • మెదక్​లో కాంగ్రెస్​ ధర్నా 

మెదక్, నర్సాపూర్, వెలుగు: నీట్ ప్రశ్న పత్రం లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు​డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం నర్సాపూర్​ పట్టణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. మెదక్​అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న రోహిత్​ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నం పత్రం లీకేజికి బాధ్యత వహిస్తూ పీఎం మోదీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

స్టూడెంట్స్​కు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.  ఆయా కార్యక్రమాల్లో నర్సాపూర్​ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, ​నర్సాపూర్ కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్​, మెదక్​ మున్సిపల్​చైర్మన్​చంద్రపాల్, నాయకులు​సుప్రభాత్​రావు, ప్రభాకర్​రెడ్డి, సుహాసిని రెడ్డి, గూడూరి ఆంజనేయులు, ఉప్పల రాజేశ్, జీవన్​ రావు, పవన్, గోపాల్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, నరేందర్, శ్రీనివాస్, సుజాత, శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. 

నీట్ పరీక్ష రద్దు చేయాలి 

రామచంద్రాపురం: నీట్ ప్రశ్న పత్రం లీక్ చేసి 24 లక్షల మంది స్టూడెంట్స్​భవిష్యత్​ను అంధకారంలో పడేశారని వెంటనే దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపించాలని ఐఎన్​టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్​చెరులో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు.

నారాయణ్ ఖేడ్: నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని ఖేడ్ పట్టణంలో తహసిల్ గ్రౌండ్ వద్ద స్టూడెంట్స్ తో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలన్నారు. వెంటనే ఎగ్జామ్ రద్దు చేసి, మళ్లీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నారు.