రామచంద్రాపురం/ పటాన్చెరు, వెలుగు: పటాన్చెరును స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మైత్రీ మైదానంలో 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టూడెంట్స్ విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించినప్పుడే వారు ఉత్తమ క్రీడాకారులుగా రాణించగలరని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్, ఎంఈవో రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్జీఎఫ్ సెక్రటరీ గోసుద్దీన్, అఫ్జల్, ప్రమోద్ గౌడ్, వివిధ పాఠశాలల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.