మున్సిపల్​ బిల్డింగ్ ఓపెనింగ్​కు రండి : గూడెం మహిపాల్ రెడ్డి

  • మంత్రి దామోదరను ఆహ్వానించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు:  కొత్తగా నిర్మించిన తెల్లాపూర్​ మున్సిపల్​ఆఫీస్​బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహను పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం మంత్రి క్వార్టర్స్​లో ప్రత్యేకంగా కలిసి ఈ నెల 20 న జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అన్ని వసతులతో సువిశాల ప్రాంగణంలో కొత్త మున్సిపల్​ భవనం నిర్మించామని మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెల్లాపూర్​లో గద్దర్​ ఆడిటోరియం నిర్మాణ పనులకు అదేరోజు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. తప్పకుండా కార్యక్రమాలకు హాజరువుతానని వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీఆర్ఎస్ సీనియర్​నాయకుడు సోమిరెడ్డి, తెల్లాపూర్​ పాలకవర్గం కౌన్సిలర్లు, కో ఆప్షన్​సభ్యులు, పట్టణ నాయకులు ఉన్నారు.