హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ : ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  ఫెయిలైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18,500 కోట్ల  విద్యత్ భారాన్ని ప్రజలపై మోపే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ అడ్డుకోగలిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తిరస్కరించేలా ఈఆర్ సీపై ఒత్తిడి చేసి విజయం సాధించామన్నారు. ఈసందర్భంగా నాయకులు, కార్యకర్తలు పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

 ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. రైతులపై రూ.18,500 కోట్ల విద్యుత్ భారాన్ని మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని దాన్ని బీఆర్ఎస్ తిప్పకొట్టడటంతో వెనక్కి తగ్గారని అన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను బీజేపీ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.