దుబ్బాక, వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలోని పేదలను ఆదుకోవడానికి పీవీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి అన్నారు. ఆదివారం భూంపల్లి రామలింగేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన పీవీఆర్ ట్రస్ట్ వలంటీర్ల సమావేశానికి హాజరై మాట్లాడారు. పేదలు ఎలాంటి అవసరమున్నా ట్రస్ట్ వలంటీర్లను సంప్రదించాలని సూచించారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పీవీఆర్ట్రస్ట్ఆధ్వర్యంలో ఒక్క రూపాయికి ఫంక్షన్ హాల్, స్టూడెంట్స్ఉన్నత విద్యకు ఆర్థిక సాయం, పోటీ పరీక్షల నిమిత్తం కోచింగ్ సెంటర్లు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త మనోహర్ రావు, పీవీఆర్ ట్రస్ట్ వలంటీర్లు, నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.