రైతులు పండించిన సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దుబ్బాక బస్టాండ్ వద్ద ఆయన రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. గురువారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో కలిసి వంటేరు ప్రతాపరెడ్డి భారీ ఎత్తున ధర్నా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.
- దుబ్బాక/ హుస్నాబాద్/ గజ్వేల్, వెలుగు