రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • ఎమ్మెల్యే సత్యనారాయణ 

 బెజ్జంకి, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం బెజ్జంకి, గన్నేరువరం మార్కెట్​కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్​పులి కృష్ణ , వైస్ చైర్మన్ చిలువర శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు పులి సంతోష్, బోనాల మల్లేశం, బండిపెల్లి రాజు, మచ్చ కుమార్, ఎల్ల పోచయ్య, మాతంగి అనిల్, నేలపట్ల కనకయ్య, నల్లచంద్రారెడ్డి, చంద్ర మౌలిక, గోడ వెంకటరెడ్డి, బోయిన్​పల్లి కృష్ణారావు  ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  బెజ్జంకి, గన్నేరువరం  మండలాల్లో 8 వేల మంది రైతులకు రూ.65 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మండలంలో సన్ ఫ్లవర్  కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు పార్టీలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్​శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.