జూన్లోనే రైతు భరోసా ఇవ్వాలె: ఎమ్మెల్యే హరీశ్ రావు

  • తడిచిన, మొలకెత్తిన వడ్లను కొనాలె
  • సన్నవడ్లకే బోనస్​ అంటే మోసం చేయడమే
  • జూన్​లోనే రైతు భరోసా ఇవ్వాలె
  • ఎమ్మెల్యే హరీశ్​రావు

సిద్దిపేట: జూన్ లోనే ఎకరానికి రూ.7,500 రైతు భరోసా  ఇవ్వాలని  ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా  చిన్నకోడూరులోని వడ్ల కొను గోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. తరుగు లేకుండా వెంటనే తడిచిన, మొలకెత్తిన వడ్లను వెంటనే కొనాలని  డిమాండ్​చేశారు.  అకాల వర్షాలతో వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు.

రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం రైస్ మిల్లుకు వెళ్లాక సంచికి మూడు కిలోలు కోతపెడు తున్నారని చెప్పారు. 40% ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉందన్నారు.  అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామ నడం రైతులను మోసం చేయడ మేనని ఫైర్​ అయ్యారు.  వరిధాన్యానికి బోనస్ అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ  ఇప్పుడు కుట్రతో ఎగ్గొట్టిందన్నారు. పచ్చిరొట్టె విత్తనాలు, సీడ్స్​ కోసం పాస్ పుస్తకాలను లైన్ లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదని విమర్శించారు.