బెల్లంపల్లిలో మన్మోహన్ సింగ్ సంతాప సభ

బెల్లంపల్లి, వెలుగు: దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు తమ కుటుంబానికి విడదీయలేని బంధం ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీస్ ఆవరణలో మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించగా ఆయన ఫొటోకు ఎమ్మెల్యే వినోద్​పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరనిలోటని అన్నారు. 

నాడు జైపూర్ పవర్ ప్రాజెక్టు డబ్బులు సాంక్షన్ చేయించారని, రామగుండానికి ఎఫ్ సీఐ తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. మన్మోహన్ సింగ్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ  బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు మత్తమారి సూరిబాబు, చిలుముల శంకర్, కార్కూరి రాంచందర్, మునిమంద రమేశ్, బండి ప్రభాకర్, సింగతి సత్యనారాయణ, రత్నం ప్రదీప్, నాతరి స్వామి, గట్టు బాణేశ్, రొడ్డ శారద పాల్గొన్నారు.