బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్, డాక్టర్లు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆస్పత్రి అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో వైద్య నిపుణులు, సిబ్బంది నియామకం గురించి వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహతో చర్చించినట్లు చెప్పారు.
వైద్యులు, సిబ్బంది స్థానికంగానే ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీడీ రవికుమార్, 13వ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ తదితరులున్నారు.