మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూతురు గడ్డం వర్ష ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని 100 పడకల ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. శిబిరాన్ని కూతురు వర్షతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కంటి చూపు కోల్పోయినవారిని తిరిగి చూపును అందించాలనే దృక్పథంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కంటి పరీక్షలు చేయించుకున్నవారికి ఉచితంగా అద్దాలు, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో ఆపరేషన్లు చేయించనున్నట్లు వర్ష తెలిపారు. ఈ శిబిరం రెండ్రోజుల పాటు జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సతీమణి గడ్డం రమ, మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కుల శ్వేత, ఎంపీటీసీ బొమ్మెన హరీశ్ గౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, ఆర్డీవో పి.హరికృష్ణ, ఏసీపీ రవికుమార్, తహసీల్దార్ జ్యోత్స్న, వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి 650 మంది హాజరైనట్లు డాక్టర్లు వెల్లడించారు. 

అక్షరాస్యత పెంపుతో ప్రయోజనాలు

కాసిపేట, వెలుగు: అక్షరాస్యత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. శనివారం కాసిపేట మండలం దేవపూర్ లో వయోజన విద్య శాఖ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అక్షరాభ్యాస కేంద్రాలను ప్రారంభించారు. చదువు వల్ల గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్​ కుమార్​దీపక్​తో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం తదితరులు ప్రదీప్ పాల్గొన్నారు.