అభివృద్ధిలో రాజీ పడేది లేదు : ఎమ్మెల్యే వినోద్

  •     బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్  

బెల్లంపల్లిరూరల్, వెలుగు : బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. సమస్యలు గుర్తించండి.. నిధులు కేటాయిస్తానని చెప్పారు. బొప్పారం బస్టాండ్​ నుంచి గ్రామంలోకి రూ.80 లక్షలతో బీటీ రోడ్డు, లంబాడితండా ఎర్రవాగుపై రూ.2 కోట్లతో వంతెన, నెన్నెల మండల కేంద్రంలో 30 లక్షలతో సీసీ రోడ్డు,  హైస్కూల్​లో రూ.2 లక్షలతో మంచినీటి బోరుకు, కేజీబీవీలో రూ.5 లక్షలతో కిచెన్​షెడ్​ నిర్మాణాలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రూ.90 లక్షలతో మెడికల్​ ఆఫీసర్,​ స్టాఫ్​ నర్సు క్వార్టర్స్​, నెన్నెల జడ్పీహెచ్​ఎస్ లో డైనింగ్​ హాల్​ను ప్రారంభించారు.

అనంతరం 32 మందికి మంజూరైన సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను అందజేశారు. వడ్లవాడలో నీటి ఎద్దడి ఉందని మహిళలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు గట్టు మల్లేశ్ పాల్గొన్నారు.

15న మార్కెట్​ప్రారంభం

బెల్లంపల్లిలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్​ను ఈ నెల 15న ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వినోద్ ఆదేశించారు. బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీస్​లో కలెక్టర్ కుమార్ దీపక్, ఇన్ చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి కౌన్సిల్, కో-ఆప్షన్ సభ్యులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోవైపు

అటవీ శాఖ ఆధ్వర్యంలో పాత బెల్లంపల్లిలో చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమానికి  ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అలాగే జటాయి కాస్మోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో నిర్వహించిన బ్యూటీషియన్ శిక్షణ శిబిరాన్ని ఆయన 
ప్రారంభించారు.