తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం :ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ , వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, వారు చేసిన త్యాగాలు మరువలేనివని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన ప్రెస్ క్లబ్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి మన తెలంగాణ మనకు వచ్చేందుకు వారు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

పార్ట్ టైం టీచర్లను తొలగించడం బాధాకరం..

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లను తొలగించడం బాధాకరమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పార్ట్ టైం ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వినతి పత్రం అంద జేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.