గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు: నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వాగ్దారి నుంచి సావర్గం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, గ్రామస్తులకు ఎలాంటి సమస్య వచ్చినా అన్నా అని పిలిస్తే పది నిమిషాల్లో మీ ముందుంటానన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

సీఎంఆర్​ చెక్కుల పంపిణీ

నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనిల్​జాదవ్​అందజేశారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, అల్లూరి శివారెడ్డి, తిరుమల్ గౌడ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోథ్ మండలం నిగిని గ్రామపంచాయతీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిఖర్ కైలాస్ టెకిడి నర్మదేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవ వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. 

ఆయన నివాసంలో లింబాజీ మహారాజ్ తో కలిసి విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, అల్లూరి శివారెడ్డి, తిరుమల్ గౌడ్, రవీందర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.