రైతు రుణమాఫీపై అపోహలు వద్దన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రెండు లక్షల లోపు అప్పు ఉంటే కచ్చితంగా రుణమాఫీ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రుణమాఫీ డేట్ వర్తిస్తుందన్నారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే రైతు వేదికలు, లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అవుతుందన్న నిబంధన లేదన్నారు. అప్పు ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ వర్తిస్తుందన్నారు ఎమ్మెల్యేవివేక్ .
చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. పలు కాలనీలో సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్నచోట డ్రైనేజీలు రోడ్లు నిర్మించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రోడ్లు సైడ్,డ్రైనేజీ ల కోసం ఆరున్నర కోట్ల రూపాయల ప్రపోజల్స్ రెడీ అయ్యాయని చెప్పారు. చెన్నూరు పట్టణంలో 30 కోట్లతో త్రాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులు కొంచెం ఆలస్యం అయ్యాయి ఓపిక పడితే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాని చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్.