- మెదక్ కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణ
- 97.03 శాతం సర్వే పూర్తి
- నల్లా కనెక్షన్లేని ఇళ్ల వివరాలు నమోదు
మెదక్, వెలుగు: జిల్లాలో మిషన్‌భగీరథ ఇంటింటి సర్వే పూర్తి కావచ్చింది. ప్రతీ ఇంటికి నీటి సరఫరా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకాన్నిచేపట్టిన సంగతి తెలిసిందే. కాగా కుటుంబాల సంఖ్య, జనాభా పెరగడంతోపాటు, పలు చోట్ల భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని, తరచూపైప్లైన్ లీకేజీలు ఏర్పడుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భగీరథ పథకం తీరుతెన్నులు తెలుసుకునేందుకు సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం గ్రామాల్లో ఎన్ని కుటుంబాలు, ఎన్నినల్లా కనెక్షన్లు ఉన్నాయి, నీటి సరఫరా ఎలా జరుగుతోంది, ప్రతీ రోజు ఎన్ని లీటర్ల నీరు సరఫరా అవుతోంది, కొత్తగా ఎన్ని ఇళ్ల నిర్మాణం జరిగింది, అదనంగా ఎంత నీరు అవసరం అనేది తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆయా వివరాల నమోదు కోసం ప్రత్యేకంగా మొబైల్యాప్రూపొందించారు. జీపీ సెక్రటరీలు, ఈజీఎస్ఫీల్డ్అసిస్టెంట్లు ఇంటింటికీ వెళ్లి సదరు యాప్‌లో కుటుంబ సభ్యుల వివరాలు, మగవాళ్లు ఎంతమంది, ఆడవాళ్లు ఎంత మంది, కులం, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ఫోన్నెంబర్ నమోదు చేయడంతో పాటు భగీరథ నల్లా వద్ద ఇంటి యజమాని ఫొటో తీసి యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు.
ఈ నెల 10న సర్వే ప్రారంభం కాగా పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 1,60,918 కుటుంబాలు ఉండగా 21 వరకు 1,56,137 కుటుంబాల (97.03 శాతం) సర్వే పూర్తయింది. క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా ఇప్పటి వరకు కొత్తగా 47,539 కుటుంబాలను గుర్తించారు. ఆర్డబ్ల్యూఎస్ఈఈ, డీపీవో తో పాటు కలెక్టర్రాహుల్రాజ్స్వయంగా భగీరథ ఇంటింటి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. పలు గ్రామాల్లో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి భగీరథ నీటి సరఫరా తీరు ఎలా ఉంది, రోజు నీటి సరఫరా ఎలా జరుగుతోంది, కుటుంబానికి సరిపడ నీరు వస్తోందా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకొని మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు.
గడువు లోగా పూర్తి
జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షణలో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే స్పీడ్‌గా జరుగుతోంది. పంచాయతీ సెక్రటరీలతో పాటు, ఈజీఎస్ ఫీల్డ్అసిస్టెంట్లకు మొబైల్ యాప్లాగిన్ఇచ్చి సర్వే చేయిస్తున్నాం. పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నది టార్గెట్. శుక్రవారం వరకు జిల్లాలో 97 శాతం సర్వే పూర్తయింది. త్వరలో 100 శాతం సర్వే టార్గెట్పూర్తవుతుంది. గ్రామాల్లో కొత్తగా గుర్తించిన ఇళ్ల వివరాలు కూడా యాప్ లో నమోదు చేస్తున్నాం. సర్వే పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.
యాదయ్య,డీపీవో