హైదరాబాద్లో ఎవర్​నార్త్ హబ్​ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్​, వెలుగు:​ హెల్త్​కేర్​ కంపెనీ ఎవర్​నార్త్​ హెల్త్ సర్వీసెస్ ఇండియా హైదరాబాద్‌‌లో ఇన్నోవేషన్ హబ్‌‌ను ప్రారంభించింది. దీని మొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ని  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఎవర్​నార్త్​ సిగ్నాకు సబ్సిడరీ. 

 యూఎస్​ వెలుపల తమకు ఇదే అతిపెద్ద కేంద్రమని తెలిపింది. ఇక్కడ 175 మంది పనిచేస్తారు. ఏడాదిలో వీరి సంఖ్యను వెయ్యికి పెంచుతామని ఎవర్​నార్త్​ ప్రకటించింది.  ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్ ఇన్నోవేషన్,  ఎక్సలెన్స్‌‌కి గ్లోబల్ హబ్‌‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూనే ఉందని, ఎవర్‌‌నార్త్ హెల్త్ సర్వీసెస్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ఈ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.