హుస్నాబాద్, వెలుగు : ఎక్కడ భూములుంటే అక్కడ తాటి, ఈతచెట్లు పెంచాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇందుకు ఎక్సైజ్, డీఆర్డీఏ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. రైతులు తమ భూములను బీళ్లుగా ఉంచకుండా పండ్లతోటలను సాగుచేయాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం(జే)లో తాటి, ఈత మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తాయని
రైతులు విరివిగా పండ్లతోటలు సాగుచేయాలన్నారు. మునగ, డ్రాగన్, పాం ఆయిల్ తోటలు వేయాలన్నారు. కులవృత్తులకు జీవం పోసేందుకు అన్ని కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో అందరికీ ఉపాధి కలుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. అక్కడ నెలకొన్న భూ వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు.
అనుబంధ రంగాల్లో రాణించాలి
కోహెడ : రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ఎంచుకొని రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం మండలంలోని కోహెడ, బస్వాపూర్ గ్రామాల్లోని రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అధికారులు సూచించిన పంటలు సాగు చేసి రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఏవో మహేశ్, డీఆర్డీవో జయదేవ్ఆర్య, పశు సంవర్దక అధికారి శ్రీనివాస్‌రెడ్డి,ఏవో భోగేశ్వర్స్వామి, వెటర్నరీ శ్రావణ్, ఏఈ రవీందర్ఉన్నారు.