ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలి : దామోదర రాజనర్సింహ

టేక్మాల్, వెలుగు: భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే ముక్తి కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం మండల పరిధిలోని బొడ్మట్ పల్లిలో భద్రకాళి వీరభద్ర సమేత కల్యాణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత  భక్తి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. 

వీరభద్ర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఈ కల్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు రమేశ్, నాయకులు మల్లారెడ్డి, విఠల్, సురేశ్,  కిషోర్,  అనిల్, శంకరప్ప, భరత్, అవినాశ్ పాల్గొన్నారు.

ఘనంగా పోచమ్మతల్లి జాతర

పుల్కల్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కోడూర్ గ్రామంలో పోచమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. జాతరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ నిర్వహకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసార్ సహ ప్రముఖ్ మదురనేని సుభాష్ చందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గారెడ్డి, మాజీ సర్పంచ్ అంజయ్య, నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్, రవీందర్, తిరుపతిరెడ్డి, నారాయణరెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.