రాయికోడ్, వెలుగు: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి జాతరలో భాగంగా రెండోరోజు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆదివారం పల్లకీ సేవ, అగ్నిగుండం, స్వామి వారి కల్యాణోత్సవం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు ముమ్మా దేవి 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీచ్కుంద పీఠాధిపతి సోమయాప్ప, రాయికోడ్ జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్, ఏవో మోహన్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షుడు అంజయ్య, మండల కాంగ్రెస్అధ్యక్షుడు బాలాజీ, నర్సింలు, డీసీసీబీ మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్, మాజీ జడ్పీటీసీ సుభాష్ పాటిల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏసయ్య, నాయకులు బస్వరాజ్ పాటిల్, కేదర్నాథ్, ప్రభాకర్, మహంకాళి, శశికాంత్‌పాటిల్, హన్మాగౌడ్, సతీశ్, మశ్చేందర్ పాల్గొన్నారు.