వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మఠం అభివృద్ధి విషయమై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అన్ని విధాలా సహకారిస్తానని మాటిచ్చారు.

మఠం ప్రాంగణంలోని ప్రభుత్వ స్థలాన్ని ఉత్సవాల నిర్వహణకు  కేటాయించాలని  కోరగా ఆ స్థలాన్ని మంత్రి పరిశీలించారు.  ఆయన వెంట పీసీసీ మెంబర్​ కిషన్, మండల పార్టీ ప్రెసిడెంట్ దిగంబర్, కోఆప్షన్ మెంబర్​ చోటుమియా, మాజీ ఎంపీటీసీ నరేందర్, రాధకిషన్, నాగేందర్​,  కులకర్ణి,  పల్లిశంకర్, శ్రీధర్ గుప్తా, ఫాజిల్, ప్రకాశం, శివకుమార్  ఉన్నారు. 

చేర్యాల, వెలుగు : మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పట్టణ విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో మద్దూరు తిరుపతి అయ్యగారు, సంఘం గౌరవాధ్యక్షుడు నారాయణ చారి

గురుమూర్తి, అధ్యక్షుడు అంజనేయులు చారి, కార్యదర్శి నర్సింహులు చారి, కోశాధికారి శ్రీనివాస్, మల్లేశం చారి, శ్రీహరి, కృష్ణమూర్తి చారి, ప్రభాకర్, లక్ష్మీనారాయణ చారి పాల్గొన్నారు.