స్టూడెంట్స్​తో కలిసి మొక్కలు నాటిన మంత్రి

 జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్​, కస్తూర్బా స్కూల్​ప్రాంగణంలో మంగళవారం స్టూడెంట్స్​తో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కస్తూర్బా కాలేజ్​లో నెలకొన్న సమస్యలను సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

 అనంతరం జోగిపేట పట్టణంలోని భగత్ సింగ్ రోడ్డు ప్రాంగణంలో చిరు వ్యాపారులకు బడా వ్యాపారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తమ నుంచి అక్రమంగా డబ్బులు వసూల్​చేస్తున్నారని పలువురు మంత్రికి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి న్యాయం చేస్తానన్నారు. మంత్రి వెంట ఆర్డీవో పాండు, డీఎస్పీ సత్తయ్య, ప్రజాప్రతినిధులు ఉన్నారు.