కౌన్సిలర్లూ..కమిషనర్ ​ప్రోగ్రామ్​కు వెళ్లొద్దు

  • సిద్దిపేట వాట్సాప్ ​గ్రూపులో మెసేజ్​లు 
  • వనమహోత్సవానికి చైర్ పర్సన్ దూరం
  • మున్సిపాలిటీలో ముదురుతున్న వివాదం 

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాలిటీలో కమిషనర్ వర్సెస్ చైర్ పర్సన్​ మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఇటీవల సర్వసభ్య సమావేశంలో వేదికపై నుంచి కమిషనర్​ను కిందికి దించిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం వన మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని వేములవాడ రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, చైర్ పర్సన్ మంజుల, కౌన్సిలర్లు పాల్గొనాల్సి ఉంది.

కానీ, కమిషనర్ హాజరవుతుండడంతో కౌన్సిలర్లు ఎవరూ రావొద్దని చైర్ పర్సన్​కు మద్దతునిస్తున్న ఓ కౌన్సిలర్ వాట్సాప్​ గ్రూప్​లో పోస్ట్​పెట్టారు. దీంతో కార్యక్రమంలో కమిషనర్ ప్రసన్న రాణితో పాటు కాంగ్రెస్, ఎంఐఎం కౌన్సిలర్లు మాత్రమే పాల్గొనడంతో బల్దియాలో సాగుతున్న అంతర్గత పోరు మరోమారు బట్టబయలైంది. కౌన్సిలర్ గ్రూప్​లో వనమహోత్సవానికి హాజరు కావొద్దనే పోస్ట్ ​స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.