ఆఫ్​లైన్ సభ్యత్వ నమోదును సక్సెస్ చేయండి : రావుల రాంనాథ్

ఖానాపూర్/ పెంబి, వెలుగు: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు సక్సెస్ చేయాలని సభ్యత్వ నమోదు పరిశీలకుడు రావుల రాంనాథ్ కోరారు. శనివారం పెంబి మండల కేంద్రంలో బీజేపీ ఆఫ్​లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. ఇప్పటివరకు ఆన్​లైన్ సభ్యత్వ సేకరణ పూర్తయ్యిందని, గిరిజన గ్రామాల్లో ఫోన్ పనిచేయని చోట పేపర్ ద్వారా నమోదు ప్రక్రియను ఈ నెల 30 వరకు పూర్తిచేయనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ ఘనత సాధించింద న్నారు.

 అలాగే ఖానాపూర్ పట్టణంలోని టీఎన్జీవో సంఘం  భవనంలో బీజేపీ పట్టణ ముఖ్య  కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. కేందర్ంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విజయాలు, బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేసి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఖానాపూర్, పెంబి బీజేపీ మండల అధ్యక్షులు ఐదు వెంకటేశ్, టేకు ప్రకాశ్, పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్, నాయకులు లక్ష్మీనారాయణ, రాజేందర్,  బోసు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.