గిన్నిస్​బుక్​లో ఎక్కేందుకు.. కోటి సీడ్ బాల్స్

కోటి సీడ్ బాల్స్ తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​ చోటు దక్కించుకునేందుకు వాసవి క్లబ్ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఖానాపూర్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్​లో వాసవి వనితా క్లబ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా సీడ్ బాల్స్ తయారీని చేపట్టారు. జామ, చింత, సీతాఫలం, వేప, కానుగ వంటి సీడ్స్ విత్తనాలు మట్టిలో పెట్టి బాల్స్ తయారు చేశారు. హైస్కూల్ విద్యార్థులు సైతం హుషారుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీడ్ బాల్స్ తయారీని చేపట్టామని క్లబ్ రీజినల్ చైర్మన్ మహాజన్ జితేందర్ తెలిపారు.   -  వెలుగు, ఖానాపూర్