బెల్లంపల్లిలో మెగా రక్తదాన శిబిరం

  • 233 యూనిట్ల రక్తం సేకరణ ఏసీపీ రవికుమార్ 

బెల్లంపల్లి, వెలుగు: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలీ భవన్ లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం లాంటిదని పేర్కొన్నారు. 233 రక్త దానం చేయగా వారి నుంచి 233 యూనిట్ల రక్తాన్ని  సేకరించినట్లు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్,  తాండూర్ సీఐలు అఫ్జలొద్దీన్,  కుమారస్వామి, శశిధర్ రెడ్డి,  ఎస్సై లు  సీహెచ్ రమేశ్, ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, రాజశేఖర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు అభినవ సంతోష్, కాసర్ల శ్రీనివాస్, కాసర్ల రంజిత్, ప్రణయ్, శ్రీనివాస్ రంజిత్, శైలజ, రజిత, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.