కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారి కోసం మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్అన్నారు. ఆదివారం మందమర్రి మండలం సారంగపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
వర్షాకాలంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
తవక్కల్ స్కూల్లో మెగా హెల్త్ క్యాంప్
రామకృష్ణాపూర్‌లోని తవక్కల్ హైస్కూల్లో మాక్స్ కేర్, రాఘవేంద్ర చిల్డ్రన్స్ హాస్పిటల్(మంచిర్యాల) సంయుక్తంగా ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్లు సుమారు 700 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. క్యాంపులో తవక్కల్ విద్యా సంస్థల అధినేత ఎండీ అబ్దుల్ అజీజ్, ఎస్ఐ జి.రాజశేఖర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.