అమెజాన్ లో ఫొటో ఆర్డర్ ​చేస్తే రూ.75 వేలు మాయం

తూప్రాన్ ,వెలుగు: అమెజాన్ యాప్ లో ఫొటో ఆర్డర్ చేయగా ఓ వ్యక్తి క్రెడిట్ కార్డ్ అకౌంట్ నుంచి రూ.75 వేలు కట్​అయ్యాయి. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన గొల్లపల్లి మనీశ్ రెడ్డి ప్రభుత్వ టీచర్​గా పనిచేస్తున్నారు. తన ఫోన్​లో అమెజాన్ యాప్ నుంచి వివేకానంద ఫొటోని ఆర్డర్ పెట్టారు.

 ఈ విషయమై  అతడి ఫోన్ కి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు నుంచి గా ఒక లింకు వచ్చింది. ఆ లింకును క్లిక్ చేయడంతో అకౌంట్లో ఉన్న రూ.75,648 రూపాయలు కట్​అయ్యాయి. ఈ విషయమై మనీశ్​రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ  తెలిపారు.