మెదక్టౌన్, వెలుగు: పీఎం మోదీకి మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో సోమవారం మెదక్, నిజామాబాద్, మేడ్చల్ బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మెదక్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్శ్రీనివాస్, నిజామాబాద్అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేడ్చల్జిల్లా ప్రెసిడెంట్విక్రమ్రెడ్డి, నాయకులు గజానంద్, జ్యోషి, మహేశ్, కరణం పరిణీత, వీణ వారణాసిలో ఉన్న తెలుగువారిని కలిసి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.
అలాగే పదేళ్ల కాలంలో మోదీ చేపట్టినఅభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూడోసారి ప్రధానిగా మోదీ ఎన్నికవుతారని 400 సీట్లు సాధించి అద్భుతమన ఘనవిజయాన్ని సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.