అలరించిన సామూహిక నృత్య ప్రదర్శనలు

  వెలుగు, భైంసా : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భైంసాలోని గాంధీ గంజ్​లో నిర్వహించిన విద్యార్థుల సామూహిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రంలో వివిధ పాఠశాలలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, జాతీయ భావాలతో కూడిన గేయాలకు ప్రదర్శనలు ఇచ్చారు.

 వందలాది మంది తరలివచ్చి ప్రదర్శనలు తిలకించారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెపు కాశీనాథ్​, సాంస్కృతిక విభాగం కన్వీనర్ పురస్తు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.