Good News: కొత్త ఏడాదికి మారుతి SUV లు.. ఈవీ, పెట్రోల్, హైబ్రిడ్ మోడల్స్ రెడీ

నూతన సంవత్సరం కానుకగా కొత్త కార్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తు్న్న వారికి మారుతి సుజుకి శుభవార్త చెప్పింది. కొత్త ఏడాది 2025లో ఎలక్ట్రిక్, పెట్రోల్, హైబ్రిడ్ మోడల్స్ లో ఎస్యూవీ(SUV) లను లాంచ్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. 2024లో ఫోర్త్ జెనరేషన్ స్విఫ్ట్ హ్యచ్ బ్యాక్, డిజైర్ కాంపాక్ట్ సెడాన్ లను లాంచ్ చేసిన మారుతి.. 2025 ఏడాది కోసం మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఎస్ యూవీలను వివిధ ఇంజిన్ లతో తీసుకురానుంది. న్యూ ఇయర్ లో వస్తున్న కొత్త మోడల్స్ గురించి తెలుసుకుందాం..

మారుతీ ఇ విటార: 

మారుతీ eVX కాన్సెప్ట్ లో తెస్తున్న ప్రెస్టీజియస్ మోడల్ ఈ విటార. ఇ విటారా ఎలక్ట్రిక్ కార్ జనవరి, 2023 ఆటో ఎక్స్ పో సందర్భంగా రివీల్ చేసిన ఈవీఎక్స్(Evx) కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా వస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ తెలిపారు. అది ప్రపంచ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా రిలీజ్ చేస్తున్న మోడల్స్ లో ఫస్ట్ మోడల్ అని కంపెనీ అంటోంది. కొత్త ఏడాది కానుకగా 2025 మార్చి లాంచ్ కానున్న ఈ మోడల్ ధరలు రూ.20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. మోస్ట్ ప్రెస్టీజియస్ మోడల్ గా తెస్తున్న ఇ విటార 49kWh బ్యాటరీ మోడల్ కు 144hp మోటర్, 61kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ కు 174hp మోటార్ కాంబినేషన్స్ ఉంటాయి. 

మార్చిలో రిలీజ్ కానున్న ఈ మోడల్ రేంజ్ 500 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. హ్యుందయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీ, మహింద్ర బీఈ 6ఈ మొదలైన మోడల్స్ కు రైవల్ గా ఈ విటారాను తీసుకొస్తోంది సుజుకీ కంపెనీ. 

మారుతి గ్రాండ్ విటారా 3 SUV:

గ్రాండ్ విటారా మోడల్ కు ఇప్పటికే మార్కెట్ లో మంచి రెస్పాన్స్ ఉంది. దీన్నే మాడిఫై చేసి SUV గా తీసుకొస్తోంది మారుతీ సుజుకీ కంపెనీ. గ్రాండ్ విటారాతో పోల్చితే వీల్ బేస్ మరింత పెద్దవిగా ఉంటాయి. కార్ హైట్ కూడా ఎక్కువగా ఉండి గ్రాండ్ లుక్ లో ఉంటుందని కంపెనీ చెబుతోంది. కంపెనీ ఇంటర్నల్ గా Y17 అనే కోడ్ లో పిలిచే ఈ ఎస్ యూవీ సిద్ధమైంది. ఫ్రంట్ లైటింగ్, బంపర్ లు ఈ విటారా లాగే అనిపించినా చాలా డిఫరెంట్ గా ఇప్పుడున్న SUVలకు కౌంటర్ పార్ట్ గా తెస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ మోడల్ 5 సీటర్  మోడల్ 1.5 లీటర్ పెట్రోల్.. 1.5 లీటర్ హైబ్రిడ్ పవర్ ట్రైన్స్ ఫీచర్స్ లిస్ట్ ఉంటుందట. ఈ SUV ధరలు రూ.12 లక్షల నుండి 22 టక్షల వరకు ఉంటాయని కంపెనీ అనౌన్స్ చేసింది.