న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా వచ్చే నెల నుంచి తమ కార్ల మోడల్స్ ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా శుక్రవారం తెలిపాయి. మోడల్‌ను బట్టి ధర మారుతుందని వెల్లడించాయి. పెరిగిన వ్యయంలో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయవలసి ఉంటుందని పేర్కొన్నాయి.
మారుతి సుజుకి దేశీయ విపణిలో ఆల్టో హ్యాచ్‌బ్యాక్ నుంచి ఇన్విక్టో మల్టీ యుటిలిటీ వాహనాల వరకు అనేక రకాల మోడళ్లను విక్రయిస్తోంది. ఈ నెల ఐదున హ్యుందాయ్ కూడా వెహికల్స్ ధరలను జనవరి 1, 2025 నుంచి రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల, డాలర్రేటు, లాజిస్టిక్స్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.