బ్లూచిప్ షేర్ల పతనంతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సెన్సెక్స్‌‌, నిఫ్టీ సోమవారం సెషన్‌‌లో నష్టాల్లో క్లోజయ్యాయి.   బ్లూచిప్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌, యాక్సిస్ బ్యాంక్  పడడంతో  నష్టాల్లో కదిలాయి.  గ్లోబల్‌‌ మార్కెట్‌‌లు కూడా నెగెటివ్‌‌లోనే ట్రేడవ్వడంతో  సెన్సెక్స్ సోమవారం 201 పాయింట్లు తగ్గి 81,508 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు (0.24 శాతం) నష్టపోయి 24,619 వద్ద ముగిశాయి. 

యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్ డేటా, ఈసీబీ పాలసీ డేటా ఈ వారం విడుదల కానుందని, ఈ డేటా వెలువడే ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. సెక్టార్ల పరంగా చూస్తే,  ఎఫ్‌‌ఎంసీజీ, ఎనర్జీ, ఆటో, హెల్త్‌‌కేర్‌‌‌‌, ఆయిల్ అండ్ గ్యాస్‌‌, బ్యాంకెక్స్‌‌, కన్జూమర్ డిస్క్రిషనరీ ఇండెక్స్‌‌లు ఎక్కువగా నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్‌‌, ఇండస్ట్రియల్స్‌‌, సర్వీసెస్‌‌, టెలీకమ్యూనికేషన్‌‌, కన్జూమర్ డ్యూరబుల్స్‌‌, మెటల్స్‌‌, ఐటీ, పవర్ సెక్టార్లు లాభాల్లో ముగిశాయి.