హోటల్​లో మండీ తిన్నవారికి ఫుడ్ పాయిజన్!

కాగజ్ నగర్, వెలుగు : కాగజ్​నగర్​లోని ఓ హోటల్​లో చికెన్ ​మండీ తిన్న పలువురికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో ఇటీవల కొత్తగా ఓ రెస్టారెంట్​ను ఓపెన్ చేశారు. అందులో శనివారం రాత్రి నలుగురు యువకులు మండీ తిన్నారు. ఇంటికి వెళ్లాక ఓ యువకుడికి అర్ధరాత్రి తీవ్ర కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు వెంటనే  స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

మిగతా ఇద్దరు కూడా ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. కడుపు నొప్పి, తల తిప్పడం, వాంతులు అవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. పట్టణంలోని హోటళ్ల నిర్వహణపై అధికారులు పట్టించుకోవడం లేదని, అందువల్లే ఇలా జరిగిం దని పలువురు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటల్ యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.