రాయికోడ్, (మునిపల్లి), వెలుగు: మునిపల్లి మండలం తక్కడపల్లి గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కురుమ సంఘం నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మండల కాంగ్రెస్అధ్యక్షుడు సతీశ్‌కుమార్, మాజీ సర్పంచ్మునీరా బేగంసర్దార్, మాజీ ఉప సర్పంచ్సంగమేశ్వర్, మాజీ సర్పంచులు సంగన్న, గొల్ల చంద్రన్న, ప్రభాకర్ పాటిల్, గ్రామ పెద్దలు సంగన్న, విజయభూషణం, నజీర్, గొల్ల అంజన్న, శ్రీను పాల్గొన్నారు.
పుల్కల్: పుల్కల్ మండల కేంద్రంలో బీరప్ప జాతర సోమవారం ఘనంగా జరిగింది. ఈ జాతరకు మంత్రి దామోదర రాజనర్సింహా హాజరయ్యారు. అనంతరం బీరప్ప అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గారెడ్డి, మన్నే విఠల్, గోవర్ధన్, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, విక్రం, ఇమ్రాన్, రాజు తదితరులు ఉన్నారు.