పీఎం విశ్వకర్మ స్కీమ్​కు నిర్మల్ మహిళ ఎంపిక

  • ఈనెల 20న పీఎం మోదీ చేతుల మీదుగా చెక్కు స్వీకరణ

నిర్మల్, వెలుగు: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి లబ్ధిదారుగా నిర్మల్ జిల్లా కాల్వ గ్రామానికి చెందిన మారాజుల లక్ష్మి ఎంపికయ్యారు. నెల 20న ఢిల్లీలో జరిగే కార్యక్ర మంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లక్ష్మి చెక్కు అందుకోనున్నారు.

ఈ పథకం కింద రాష్ట్రం నుంచి మొదటిసారిగా నిర్మల్ మహిళ ఎంపిక కావడం పట్ల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో లక్ష్మిని ఘనంగా సన్మానించారు.