సంగారెడ్డిలో మామిడి ప్రదర్శన

సంగారెడ్డి టౌన్, వెలుగు : కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ఫల పరిశోధన కేంద్రం, సంగారెడ్డిలో 477 రకాల మామిడి రకాలు ఉన్నాయని యూనివర్సిటీ వైస్​ఛాన్స్​లర్​ నీరజా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని ఫలపరిశోధన కేంద్రంలో రెండు రోజుల మామిడి రకాల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిడి మొక్కల ఎంపిక, సాగు పద్దతుల గురించి రైతులకు వివరించారు.

22న కూడా ఫల ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. సుమారు 260 రకాలకు పైగా మామిడిపళ్లను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, శ్రీధర్, శైలజ, సమత, స్పందన, కీర్తి, కృష్ణ, శాస్త్రవేత్తలు హరికాంత్, మాధవి, మౌనిక, నితీశ్ కుమార్ పాల్గొన్నారు.