కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: యువత చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి కార్మికులకు సూచించారు. గురువారం రామకృష్ణాపూర్ఓపెన్ కాస్ట్‌లోని మహాలక్ష్మి ఓబీ క్యాంప్‌లో కాంట్రాక్ట్ కార్మికులకు గంజాయి, డ్రగ్స్‌పై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. జీవితాన్ని నాశనం చేసే గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగిఉండాలన్నారు.
వీటి నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడాలని.. కాలనీలు, గ్రామాల్లో ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినా తమ దృష్టికి తేవాలని కోరారు. రామకృష్ణాపూర్ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్ధాలు వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీసీసీ నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ కోరారు. సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు.