పిల్లలకు సెల్​ఫోన్లు ఇవ్వొద్దు : జీఎం జి.దేవేందర్

  • జీఎం జి.దేవేందర్
  • కేకే డిస్పెన్సరీలో సెల్​ కౌంట్ కేంద్రం ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: పిల్లల పెంపకంపై మరింత అవగాహన పెరగాలని, అల్లరి మాన్పించేందుకు పిల్లలకు సెల్​ఫోన్లు ఇవ్వొద్దని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​ సూచించారు. మందమర్రిలోని సింగరేణి కేకే డిస్పెన్సరీలో రక్త పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సెల్ ​కౌంట్​ సెంటర్, వెల్​ బేబీ షోను జీఎం దేవేందర్, స్వరూపారాణి దంపతులు శుక్రవారం ప్రారంభించారు. పిల్లలు సెల్​ఫోన్లకు అలవాటు పడటంతో శారీరకంగా, మానసికంగా ఎదగలేరన్నారు. 

వెల్​బేబీ షో కార్యక్రమం వల్ల తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, వారి మానసిక వికాసం, శారీరక ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సింగరేణి చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్​ శ్యామల, ఏస్వోటుజీఎం విజయ్​ప్రసాద్, పర్సనల్​మేనేజర్ ​శ్యాంసుందర్, కేకే డిస్పెన్సరీ డీవైసీఎంవో డాక్టర్​ కె.నాగేశ్వర్​ రావు తదితరులు పాల్గొన్నారు.