ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం : ఫయాజోద్దిన్

జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే డా.గడ్డం వివేక్ వెంకట స్వామిపై వస్తున్న ఆరోపణలను మండల కాంగ్రెస్  లీడర్లు ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఫయాజోద్దిన్, సీనియర్ లీడర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలు చేపడుతూ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ​వెంకటేశ్వర్ గౌడ్, పార్టీ లీడర్లు పాపిరెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.