మంచిర్యాల డాక్టర్ ఇంట్లో చోరీ కేసు..12మంది అరెస్ట్..15లక్షల నగదు స్వాధీనం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం( డిసెంబర్8) జిల్లాకేంద్రంలోని డాక్టర్ విజయబాబు ఇంట్లో చోరీ చేసిన12 మందిని అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.15 లక్షల50 వేల నగదు, 35తులాల బంగారం ఆభరణాలు, ఓ కట్టర్, లాకర్ స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ | రైతును మోసం చేసిన పత్తి విత్తనాల కంపెనీ బేయర్‎కు భారీ జరిమానా

నవంబర్ 30 న  మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉంటున్న డాక్టర్ విజయ్ బాబు ఇంట్లో ఆయన ఆస్పత్రిలో పనిచేసేవారే చోరీకి పాల్పడ్డారని పోలీసులు విచారణలో తేలింది. విజయ్ బాబుకు చెందిన విజయ నర్సింగ్ హోం లో పనిచేస్తున్న రాజేశ్వరీ, నస్రీన్, స్వప్న అనే మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి రూ. 50 లక్షల నగదు, నగలు ఎత్తుకెళ్లారు.  

డాక్టర్, ఫ్యామిలీ ఇంట్లో లేని సమయంలో నకిలీ తాళాలలో బెడ్ రూం తలుపులు ఓపెన్ చేసి అందులో ఉన్న లాకర్ ను దొంగిలించారని పోలీసుల విచారణలో తేలింది. డాక్టర్ ఫిర్యాదు మేరకు క్లూస్ రంగంలోకి దిగి 12 మందిని అరెస్ట్ చేశారు.  నిందితులనుంచి  35 తులాల బంగారు ఆభరణాలను, రూ.15 లక్షల 50 వేలనగదుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఒక ఆటో, ఒక స్కూటీ, రెండు బైక్ లు, లాకర్ , లాకర్ కట్టర్ మిషిన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి రివార్డులను అందించారు.