మంచిర్యాల జిల్లా 40 మందికి కంటి ఆపరేషన్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ డేగ బాబు సహకారంతో వేంపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 150 మందికి కంటి పరీక్షలు చేసినట్లు క్లబ్​ సభ్యులు తెలిపారు.

 కంటి సమస్యతో బాధపడుతున్న 40 మందిని గుర్తించి వారికి రేకుర్తి కంటి హాస్పిటల్​లో ఆపరేషన్లు చేయించామన్నారు. లయన్స్ క్లబ్ మెంబర్లు మధుసూదన్ రెడ్డి, సురేందర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.