మంచిర్యాల, వెలుగు: రాత్రివేళల్లో అకారణంగా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాత్రి ఏసీపీ ప్రకాశ్, టౌన్సీఐ బన్సీలాల్తో కలిసి బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా, ముఖరాం చౌరస్తాల్లో ఆపరేషన్ ఛబుత్ర స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైక్లకు సరైన డాక్యుమెంట్లు, నంబర్ ప్లేట్లు లేకపోవడమే గాక అకారణంగా చక్కర్లు కొడుతున్న 54 మందిని పట్టుకున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులు బుక్ చేశారు. పట్టుబడిన వారందరికీ ఐబీ చౌరస్తాలో డీసీపీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పోకిరీలపై నిఘా పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ఇచ్చారు. సీజ్ చేసిన బైక్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. టౌన్ ఎస్ఐలు మహేందర్, ప్రశాంత్, సనత్, హాజీపూర్, నస్పూర్ఎస్ఐలు సురేశ్, సుగుణాకర్ పాల్గొన్నారు.