ఫొటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు

  •  ప్రెసిడెంట్​గా కొత్తపల్లి సతీశ్

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా ఫొటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్ని కలు ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా 
కొత్తపల్లి సతీశ్, జనరల్​సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా మదరబోయిన శ్రీనివాస్ ను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కోచెర్ల శ్రీనివాస్, సహయ కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా రఘు, ప్రచార కార్యదర్శిగా రాము, గౌరవ అధ్యక్షుడిగా ఈసంపల్లి రమేశ్​తో పాటు 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీశ్, శ్రీనివాస్​ మాట్లాడుతూ..జిల్లాలోని వీడియో, ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి కుటుంబానికి హెల్త్ కార్డులు, ప్రమాద బీమా కల్పించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను సాధిస్తామన్నారు. ఎన్నికల్లో వివిధ టీవీ ఛానళ్లకు చెందిన వీడియో జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, స్టింగర్స్ పాల్గొనగా ఎన్నికల అధికారులుగా జుట్టు రమేశ్, అనుమాండ్ల శ్రీనివాస్, ఈసంపల్లి రమేశ్ వ్యవహరించారు.